రేపు తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా-tg tet 2025 hall tickets will be released tomorrow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రేపు తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా

రేపు తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా

Published Jun 10, 2025 03:58 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 10, 2025 03:58 PM IST

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు రేపు(జూన్ 11) విడుదలవుతాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు tgtet.aptonline.in/tgtet వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. జూన్ 18 నుంచి30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు జూన్ 11వ తేదీన విడుదల కానున్నాయి.అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బుధవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టెట్ అధికారులు ప్రకటన చేశారు.

(1 / 6)

టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు  https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే ' Hall Tickets(I) Download 2025 ఆప్షన్ పై నొక్కాలి. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

(2 / 6)

విద్యాశాఖ నిర్ణయంచిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 18 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి.

(3 / 6)

పరీక్షల షెడ్యూల్ వివరాల ప్రకారం…. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.

(4 / 6)

ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్‌-1కు 63,261 , పేపర్‌-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.

(5 / 6)

తెలంగాణ టెట్ పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. ఆపై ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత…. జూలై 22వ తేదీన టెట్‌ తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఇక అభ్యర్థులు మాక్ టెస్టులు రాసుకునేందుకు వీలుగా వెబ్ సైట్ లో ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా పరీక్షలపై ఓ అవగానకు రావొచ్చు.

(6 / 6)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు