TG Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీలో నిబంధనల కిరికిరి, ఆదాయ వివరాలతో దరఖాస్తుల తిరస్కరణ!
TG Ration Cards : తెలంగాణలో గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో...కొత్త రేషన్ కార్డులకు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. కొత్తగా పెళ్లైన జంటలు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారు. అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం కాకపోవడం, కొత్త నిబంధనలతో అర్జీదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
(1 / 6)
తెలంగాణలో గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో...కొత్త రేషన్ కార్డులకు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. కొత్తగా పెళ్లైన జంటలు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారు. పిల్లల పేర్లు జోడింపు, మరణించిన వారి పేర్లు తొలగింపు..ఇలా రేషన్ కార్డులో మార్పు చేర్పుల కోసం ఎదురుచూస్తున్నారు.
(2 / 6)
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణతో పాటు జారీ ప్రక్రియ ప్రారంభించింది. జనవరి 26న మండలానికి ఒక గ్రామం చొప్పున కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. ఇక కొత్త రేషన్ కార్డులకు మార్గం సుగుమం అయ్యిందని దరఖాస్తుదారులు భావించారు. అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం కాకపోవడం, కొత్త నిబంధనలతో అర్జీదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
(3 / 6)
కొత్త రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది. 360 డిగ్రీ సాప్ట్వేర్ తో రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారి ఆదాయ వివరాలను ఆధార్ కార్డు సాయంతో స్కాన్ చేస్తున్నారు. దీంతో దరఖాస్తుల ఆదాయ వివరాలు, వారికి కారు ఉన్నా, ప్లాట్లు, ఇళ్లు ఉన్నా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువ ఆదాయ వనరులు ఉన్న వారి దరఖాస్తులను అధికారులు తిరస్కరణ జాబితాలో పెడుతున్నారు.
(4 / 6)
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు... ఆదాయ లెక్కింపు విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు మార్చి అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
(5 / 6)
ఇటీవల మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, రైతు భరోసా వంటి పథకాలు అమలుచేశారు. కొత్త కార్డులు పొందిన వారికి వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం, ఇతర సరకులు పంపిణీ చేయనున్నారు.
(6 / 6)
పదేళ్ల నుంచి కొత్త కార్డులు, మార్పు చేర్పులకు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ప్రజాపాలన, కుటుంబ సర్వేలో అనేక మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
ఇతర గ్యాలరీలు