తెలుగు న్యూస్ / ఫోటో /
TG Liquor Sales : తెలంగాణలో మద్యం సరఫరాకు బ్రేక్, సర్వర్ డౌన్ తో డీలర్లకు తిప్పలు
TG Liquor Sales : తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరాకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా మొత్తం ఆన్ లైన్ లో జరుగుతోంది. అయితే సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మద్యం సరఫరాను నిలిచిపోయింది.
(1 / 6)
తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరాకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా మొత్తం ఆన్ లైన్ లో జరుగుతోంది. అయితే సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మద్యం సరఫరాను నిలిచిపోయింది. (Pexels)
(2 / 6)
సర్వర్ల ఇష్యూతో మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. మద్యం సరఫరా నిలిచిపోవడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాత్రి లోపు సర్వర్ సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
(3 / 6)
తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ తగలబోతుంది. త్వరలో మద్యం ధరలు పెరగబోతున్నాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం ధరల పెంపునకు రెడీ అయ్యింది.
(4 / 6)
మరికొన్ని రోజుల్లో మద్యం ధరలు పెరగనున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల ఉన్న ధరలకు అనుగుణంగా తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.
(5 / 6)
లిక్కర్ పై రూ.20 నుంచి రూ.70 వరకు, బీరుపై రూ.20 వరకు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల సర్దుబాటుతో ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.1000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
ఇతర గ్యాలరీలు