TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్- ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక ఇచ్చే యోచనలో ప్రభుత్వం!-tg indiramma housing scheme free sand for construction low price for iron cement ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్- ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక ఇచ్చే యోచనలో ప్రభుత్వం!

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్- ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక ఇచ్చే యోచనలో ప్రభుత్వం!

Jan 01, 2025, 10:29 PM IST Bandaru Satyaprasad
Jan 01, 2025, 10:29 PM , IST

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే తక్కువ ధరకే సిమెంటు, ఇనుమును అందించేలా సంబంధిత కంపెనీలతో మాట్లాడాలని యోచిస్తుంది

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ యాప్ లో లబ్దిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. 

(1 / 7)

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంటు, ఇనుమును అందించేలా సంబంధిత కంపెనీలతో మాట్లాడాలని ప్రభుత్వం యోచిస్తుంది. తాజాగా ఇసుకను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రకటించినప్పుడు... సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం, స్థలం లేనివారికి స్థలం కేటాయించి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

(2 / 7)

ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఐరస్, సిమెంటు ధరలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇసుకను ఫ్రీ ఇవ్వాలని, సిమెంటు, ఇనుమును తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక(37-40 టన్నులు) ఇసుక అవసరమవుతుందని గృహనిర్మాణ సంస్థ అధికారులు అంచనా వేశారు.  

(3 / 7)

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక అందించేందుకు ఖనిజాభివృద్ధి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక లభ్యత, ధరల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని సమాచారం. 

(4 / 7)

ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుకు వినియోగిస్తారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనిని ప్రభుత్వం భరించాలని భావిస్తోందని సమాచారం.  రాష్ట్రంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో రెండు, ములుగు జిల్లాలో ఒకటి, కాళేశ్వరం వద్ద రెండు ర్యాంపులు ఉన్నాయి. వీటి నుంచే ఇసుక అందుబాటులో ఉంది.  

(5 / 7)

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారిలో లబ్దిదారుల ఎంపికకు పెద్ద ఎత్తున సర్వే జరుగుతోంది.  ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకోని వారి కోసం మరోసారి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

(6 / 7)

ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలన దరఖాస్తు చేసుకోకపోతే ఎంపీడీవో అలాగే మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్నవారికి లేదా గుడిసె పెంకుటిల్లు ఉన్నవారికి మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందే అవకాశం ఉంది.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు