January 1st Holiday : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, జనవరి 1న పబ్లిక్ హాలిడే-ఏపీలో మాత్రం ఆప్షనల్ హాలిడే
January 1st Holiday : న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు జనవరి1న సెలవు ఉంటుంది. ఏపీలో మాత్రం జనవరి 1న పబ్లిక్ హాలిడేగా ప్రకటించలేదు. ఆప్షనల్ హాలిడే ఇచ్చారు
(1 / 6)
ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి భేదాలు లేకుండా జరుపుకునే ఏకైనా వేడుక న్యూ ఇయర్. దాదాపుగా అన్ని దేశాల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు.
(2 / 6)
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తుంది. సాయంత్రం నుంచి చిన్న, పెద్ద అంతా న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.
(3 / 6)
డిసెంబర్ 31న ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేసి...జనవరి 1న ఉద్యోగాలు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు జనవరి1న సెలవు ఉంటుంది.
(istockphoto)(4 / 6)
ఏపీలో మాత్రం జనవరి 1న పబ్లిక్ హాలిడేగా ప్రకటించలేదు. ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేయనున్నాయి. ప్రత్యేక హాలిడే ఇవ్వకపోవడంతో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
(istockphoto)(5 / 6)
జనవరి 1..ఏడాదిలో మొదటి రోజున సంతోషంగా గడపాలని ప్లాన్ చేసుకుంటారు. కుటుంబం, స్నేహితులతో ఆలయాలకు, టూర్ లకు వెళ్తుంటారు.
ఇతర గ్యాలరీలు