TG EAPCET 2025 Key Dates : దరఖాస్తుల నుంచి పరీక్షల వరకు...! తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ ముఖ్య తేదీలివే
- TG EAPCET(EAMCET) 2025 Notification: తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించిన ముఖ్య తేదీలను ఇక్కడ తెలుసుకోండి…..
- TG EAPCET(EAMCET) 2025 Notification: తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించిన ముఖ్య తేదీలను ఇక్కడ తెలుసుకోండి…..
(1 / 6)
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు.
(2 / 6)
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం ఈఏపీసెట్ పరీక్షలు జరుగుతాయి. ఇక మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తాయి. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తరపున హైదరాబాద్ జేఎన్‌టీయూనే ఎగ్జామ్స్ నిర్వహించనుంది.
(3 / 6)
ఈఏపీసెట్ ఎంట్రెన్స్ కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా కొనసాగుతుంది.
(4 / 6)
ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 24 వరకు కూడా దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.
ఏప్రిల్ 9 వరకు రూ. 250 ఆలస్య రుసుము, ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆలస్య రుసుము నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 18 వరకు రూ. 2500 ఆలస్య రుసుము, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు.
(5 / 6)
తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. జేఎన్టీయూ హైదరాబాద్ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(6 / 6)
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. ఇక మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. తెలంగాణతోపాటు ఏపీలో కర్నూల్, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.
ఇతర గ్యాలరీలు