విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచే ఇంజినీరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్, జూలై 7 వరకు స్లాట్ బుకింగ్స్-tg eapcet 2025 engineering counselling starts from today key details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచే ఇంజినీరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్, జూలై 7 వరకు స్లాట్ బుకింగ్స్

విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచే ఇంజినీరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్, జూలై 7 వరకు స్లాట్ బుకింగ్స్

Published Jun 28, 2025 10:00 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 28, 2025 10:00 AM IST

నేటి నుంచి తెలంగాణ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అర్హత సాధించిన అభ్యర్థులు జులై 7 వరకు స్లాట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి (జూన్ 28) ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 3 ఫేజ్​లలో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వివరాలను పేర్కొంది.

(1 / 8)

ఇవాళ్టి నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జులై 7వ తేదీ వరకు ఆన్లైన్ స్లాట్ బుక్కింగ్​కి అవకాశం ఉంటుంది. జూలై 1వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.

(2 / 8)

జూలై 6 నుంచి జూలై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. జూలై 13వ తేదీలోపు ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది.

(3 / 8)

జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు.జూలై 15వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆప్షన్లపై ఫ్రీజింగ్ ఉంటుంది. జూలై 18వ తేదీలోపు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

(4 / 8)

జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు.

జూలై 15వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆప్షన్లపై ఫ్రీజింగ్ ఉంటుంది. జూలై 18వ తేదీలోపు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

(image source istock.com)

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తొలిసారిగా మాక్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ప్రవేశపెట్టింది. అందులో సీట్లు పొందిన తర్వాత అవసరమైతే వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవచ్చు.

(5 / 8)

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ..ఫీజులపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వెబ్‌ ఆప్షన్లు మొదలయ్యే నాటికి ఫీజులు, సీట్ల వివరాలను వెబ్‌సైట్లో ఉంచుతామని ఎప్‌సెట్‌ సవివర నోటిఫికేషన్‌లో తెలిపారు. దాదాపు పాత ఫీజులే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

(6 / 8)

తెలంగాణ ఈఏపీసెట్ - 2025 వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు పలు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే….. ర్యాంక్(స్కోర్) కార్డు డిస్ ప్లే అవుతుంది.ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

(7 / 8)

టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు