AP TG Temperature Updates : వేసవి ముందే... భానుడి భగభగలు - పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
- AP Telangaan Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి పూర్తి కాకముందే… భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రెండు మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు మరికొంత మేర పెరగనున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangaan Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి పూర్తి కాకముందే… భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రెండు మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు మరికొంత మేర పెరగనున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
(1 / 8)
ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఫిబ్రవరి నెల దాటకముందే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది.
(2 / 8)
ఉత్తర కోస్తా, ఏపీ, యానాంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా, సీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
(3 / 8)
ఏపీలోని ఉత్తర కోస్తాలో చూస్తే ఇవాళ…. పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కూడా పూర్తిగా పొడిగా ఉండనుంది.
(image source unsplash.com)(4 / 8)
దక్షిణ కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఉండనుంది.
(5 / 8)
రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు,పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
(image source unsplash)(6 / 8)
తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(Unsplash)(7 / 8)
శుక్రవారం తెలంగాణలో చూస్తే మహబూబ్ నగర్ లో అత్యధికంగా 36.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక ఖమ్మంలో 36.6, భద్రాచలంలో 35.6, హన్మకొండ -35 డిగ్రీలు, హైదరాబాద్ లో 34.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఏపీలోని నందిగామలో 36.1 డిగ్రీలు, విజయవాడలో 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(image source pixabay )(8 / 8)
గత వారం రోజులతో పోల్చితే… ఈ రెండు మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 1- 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలా ఉన్నప్పటికీ…. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లొద్దని చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు