Davos Telugu CMs Meet : దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు-అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై చర్చ-telugu states cms chandrababu revanth reddy meets at zurich airports attends davos wef summit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Davos Telugu Cms Meet : దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు-అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై చర్చ

Davos Telugu CMs Meet : దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు-అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై చర్చ

Jan 20, 2025, 02:25 PM IST Bandaru Satyaprasad
Jan 20, 2025, 02:25 PM , IST

Davos Telugu CMs Meet : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యురిచ్ ఎయిర్ పోర్టులు కలుసుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించుకున్నారు.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యురిచ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించుకున్నారు. 

(1 / 6)

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.

(2 / 6)

దావోస్‌ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్‌ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. సీఎంతో బాటు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, అధికారుల బృందం ఉన్నారు.

(3 / 6)

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతలు ఫొటోలు దిగారు. సోమవారం జ్యురిచ్‌లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది. 

(4 / 6)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  సారథ్యంలో ప్రతినిధి బృందం  సోమవారం ఉదయం స్విట్జర్లాండ్​ లోని  జ్యురిచ్ కు చేరుకుంది.  దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందానికి జ్యురిచ్ ఎయిర్ పోర్ట్ లో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. 

(5 / 6)

దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే భారీ పెట్టుబడుల లక్ష్యంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో  సీఎం రేవంత్ రెడ్డి  బృందం చర్చలు జరపనుంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు