బ్రేక‌ప్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన స‌త్య‌భామ సీరియ‌ల్ హీరోయిన్ - వ‌రుడు కావాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌-telugu serial heroine debjani modak reveals her love breakup story in kiraak boys khiladi girls 2 show ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బ్రేక‌ప్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన స‌త్య‌భామ సీరియ‌ల్ హీరోయిన్ - వ‌రుడు కావాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

బ్రేక‌ప్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన స‌త్య‌భామ సీరియ‌ల్ హీరోయిన్ - వ‌రుడు కావాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

Published May 16, 2025 01:28 PM IST Nelki Naresh
Published May 16, 2025 01:28 PM IST

ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం సీరియ‌ల్‌తో తెలుగు బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది బెంగాళీ బ్యూటీ దేబ్జానీ మోద‌క్‌. ఆ త‌ర్వాత స‌త్య‌భామ సీరియ‌ల్ చేసింది. ఈ రెండు సీరియ‌ల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకుంది.

ప్ర‌స్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ సీజ‌న్ 2 షోలో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది దేబ్జానీ మోద‌క్‌.

(1 / 5)

ప్ర‌స్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ సీజ‌న్ 2 షోలో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది దేబ్జానీ మోద‌క్‌.

ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోల త‌న బ్రేక‌ప్ స్టోరీని బ‌య‌ట‌పెట్టింది దేబ్జానీ మోద‌క్‌.

(2 / 5)

ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోల త‌న బ్రేక‌ప్ స్టోరీని బ‌య‌ట‌పెట్టింది దేబ్జానీ మోద‌క్‌.

ఓ అబ్బాయిని తాను సీరియ‌స్‌గా ల‌వ్ చేశాన‌ని, అత‌డు చాలా హైప‌ర్ యాక్టివ్ అని చెప్పింది. ఎవ్రీ వీకెండ్ ట్రిప్‌ల‌కు వెళ్దామ‌ని అనేవాడ‌ని, తాను మాత్రం సీరియ‌ల్స్ షూటింగ్‌లో బిజీగా ఉండేదాన్ని అని దేబ్జానీ చెప్పింది.

(3 / 5)

ఆ విష‌యంలో త‌మ మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు రావ‌డంతో బ్రేక‌ప్ చెప్పుకున్నామ‌ని అన్న‌ది. అత‌డు ఇండ‌స్ట్రీకి చెందిన వాడేనా అని శ్రీముఖి అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం దేబ్జానీ సిగ్గుప‌డింది.

(4 / 5)

ఆ విష‌యంలో త‌మ మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు రావ‌డంతో బ్రేక‌ప్ చెప్పుకున్నామ‌ని అన్న‌ది. అత‌డు ఇండ‌స్ట్రీకి చెందిన వాడేనా అని శ్రీముఖి అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం దేబ్జానీ సిగ్గుప‌డింది.

వ‌రుడు కావాలి అంటూ సోష‌ల్ మీడియాలో దేబ్జానీతో ఓ ఫొటో పెట్టించింది శ్రీముఖి. ఆ ఫొటోకు వ‌చ్చిన కామెంట్స్‌ను చ‌దివి వినిపించింది.

(5 / 5)

వ‌రుడు కావాలి అంటూ సోష‌ల్ మీడియాలో దేబ్జానీతో ఓ ఫొటో పెట్టించింది శ్రీముఖి. ఆ ఫొటోకు వ‌చ్చిన కామెంట్స్‌ను చ‌దివి వినిపించింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు