(1 / 7)
వైవిధ్యమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్‌లకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాలను చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అఖండ విజయాన్ని అందిస్తుంటారు ఆడియెన్స్.
(2 / 7)
అలా తెలుగులో హారర్ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమానే టుక్ టుక్. సి. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చిత్రవాహిని, ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ నిర్మించారు.
(3 / 7)
టుక్ టుక్ మూవీలో కోర్ట్ మూవీ హీరో హర్ష్ రోషన్, సలార్ ఫేమ్ కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 21న థియేటర్లలో విడుదలైన టుక్ టుక్ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
(4 / 7)
అయితే, బాక్సాఫీస్ పరంగా పెద్దగా కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయిన టుక్ టుక్ మూవీ ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.2 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలాంటి టుక్ టుక్ ఓటీటీలో ఇదివరకే స్ట్రీమింగ్ అవుతోంది.
(5 / 7)
ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్‌లో టుక్ టుక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 21 రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన టుక్ టుక్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది టుక్ టుక్ మూవీ.
(6 / 7)
హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరరెక్కిన టుక్ టుక్ ఇవాళ (ఏప్రిల్ 18) మరో ఓటీటీలో దర్శనం ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో టుక్ టుక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి 5 భాషల్లో టుక్ టుక్ ఓటీటీ రిలీజ్ కావడం విశేషంగా మారింది.
ఇతర గ్యాలరీలు