Papikondalu Tour 2025 : ఈ సెలవుల్లో 'పాపికొండలు' చూసొద్దామా! తెలంగాణ టూరిజం ప్యాకేజీ వచ్చేసింది, పూర్తి వివరాలివే-telangana tourism to operate papikondalu tour package from hyderabad on 17 january 2025 full details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Papikondalu Tour 2025 : ఈ సెలవుల్లో 'పాపికొండలు' చూసొద్దామా! తెలంగాణ టూరిజం ప్యాకేజీ వచ్చేసింది, పూర్తి వివరాలివే

Papikondalu Tour 2025 : ఈ సెలవుల్లో 'పాపికొండలు' చూసొద్దామా! తెలంగాణ టూరిజం ప్యాకేజీ వచ్చేసింది, పూర్తి వివరాలివే

Jan 11, 2025, 12:04 PM IST Maheshwaram Mahendra Chary
Jan 11, 2025, 11:47 AM , IST

  • TG Tourism Papikondalu Tour Package : ఈ సంక్రాంతి సెలవుల వేళ పాపికొండలకు వెళ్లాలనుకుంటున్నారా..? మీకోసమే తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… 3 రోజులుగా ఉంది. టూర్ షెడ్యూల్, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

సంక్రాంతి సెలవులు వచ్చాయి. అయితే ఈ హాల్ డేస్ లో ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన పాపికొండలు చూసేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఏడాదిలో పాపికొండలు ట్రిప్ ఆపరేట్ చేయటం కూడా ఇదే తొలిసారి.

(1 / 8)

సంక్రాంతి సెలవులు వచ్చాయి. అయితే ఈ హాల్ డేస్ లో ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన పాపికొండలు చూసేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఏడాదిలో పాపికొండలు ట్రిప్ ఆపరేట్ చేయటం కూడా ఇదే తొలిసారి.(image source @TravelTelangana)

పాపికొండల చూసేందుకు తెలంగాణ టూరిజం “PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR ” పేరుతో ఓ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో తీసుకెళ్తారు. ప్రస్తుతం ఈ జర్నీ జనవరి 17, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. 

(2 / 8)

పాపికొండల చూసేందుకు తెలంగాణ టూరిజం “PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR ” పేరుతో ఓ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో తీసుకెళ్తారు. ప్రస్తుతం ఈ జర్నీ జనవరి 17, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. (image source @TravelTelangana)

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం 3 రోజులు ఉంటుంది. వీకెండ్స్ లో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు.

(3 / 8)

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం 3 రోజులు ఉంటుంది. వీకెండ్స్ లో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు.(image source @TravelTelangana)

టూర్ షెడ్యూల్ వివరాలు చూస్తే… ఫస్ట్ డే రాత్రి 07.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రాత్రి 8 గంటలక బషీర్ బాగ్ వద్దకు వస్తుంది. రాత్రి భద్రాచలం వెళ్తారు. మార్గ మధ్యలో భోజనం ఉంటుంది.

(4 / 8)

టూర్ షెడ్యూల్ వివరాలు చూస్తే… ఫస్ట్ డే రాత్రి 07.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రాత్రి 8 గంటలక బషీర్ బాగ్ వద్దకు వస్తుంది. రాత్రి భద్రాచలం వెళ్తారు. మార్గ మధ్యలో భోజనం ఉంటుంది.(image source @TravelTelangana)

రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారిత హోటల్ కు చేరుకుంటారు. 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకొని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పొచారానికి బోట్ లో జర్నీ ఉంటుంది. లంచ్ తో పాటు స్నాక్స్ ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్ లో బస చేస్తారు.

(5 / 8)

రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారిత హోటల్ కు చేరుకుంటారు. 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకొని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పొచారానికి బోట్ లో జర్నీ ఉంటుంది. లంచ్ తో పాటు స్నాక్స్ ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్ లో బస చేస్తారు.(image source @TravelTelangana)

మూడో రోజు టిఫిన్ చేసిన తర్వాత  పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత… హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 10గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. 

(6 / 8)

మూడో రోజు టిఫిన్ చేసిన తర్వాత  పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత… హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 10గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. (image source @TravelTelangana)

హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 6999గా ఉంటే… పిల్లలకు రూ. 5599గా నిర్ణయించారు. . నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బోట్ లో భోజనం ఇస్తారు. ఏమైనా సందేహాలు  info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

(7 / 8)

హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 6999గా ఉంటే… పిల్లలకు రూ. 5599గా నిర్ణయించారు. . నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బోట్ లో భోజనం ఇస్తారు. ఏమైనా సందేహాలు  info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.(image source @TravelTelangana)

హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/package/papikondalutour 

(8 / 8)

హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/package/papikondalutour 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు