తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సాగర్ నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వివరాలివే
- Hyderabad Nagarjunsagar Srisailm Tour : తెలంగాణ టూరిజం తక్కువ ధరలోనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సాగర్, శ్రీశైలం ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. నాగార్జున సాగర్ నుంచి బోట్ లో జర్నీ చేయవచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ నెలలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….
- Hyderabad Nagarjunsagar Srisailm Tour : తెలంగాణ టూరిజం తక్కువ ధరలోనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సాగర్, శ్రీశైలం ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. నాగార్జున సాగర్ నుంచి బోట్ లో జర్నీ చేయవచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ నెలలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….
(1 / 6)
కృష్ణమ్మ ప్రకృతి అందాలను చూసి అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే రెండు రోజుల ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం చూసి రావొచ్చు.
(2 / 6)
‘Hyd - Srisailam - Nagarjunasagar - Hyd (Road cum River Cruise Tour)’ పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ వచ్చే డిసెంబర్ 07, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ముందస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
(3 / 6)
హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. హైదరాబాద్ లో ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రికి సాగర్ లోనే బస చేస్తారు.
(4 / 6)
ఇక రెండో రోజు సాగర్ నుంచి బయల్దేరి..శ్రీశైలం చేరుకుంటారు. ఇక్కడ క్రూజ్ బోట్ ద్వారా జర్నీ ఉంటుంది. బోట్ లో మీల్స్ ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి వరకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
(5 / 6)
హైదరాబాద్ - సాగర్ - శ్రీశైలం టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4499 గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3599గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. శనివారం తేదీల్లో ఈ జర్నీ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు