Arunachalam Tour : 'అరుణాచళేశ్వరుడి' దర్శనం - హైదరాబాద్ నుంచి 3 రోజుల ట్రిప్, ఏప్రిల్ నెల టూర్ ప్యాకేజీ వివరాలివే
- గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
- గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
(1 / 7)
అరుణాచలం వేళ్లే వారికి తెలంగాణ టూరిజం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
(2 / 7)
10 ఏప్రిల్ 2025వ తేదీన ఈ ట్రిప్ అందుబాటులో ఉంది. ఈలోపే ఆసక్తి ఉన్న ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
(3 / 7)
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం మాత్రమే కాదు… కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ చూడొచ్చు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వాళ్లు హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సి ఉంటుంది తొలిరోజు బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది.
(4 / 7)
ఇక 2వ రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రి అరుణాచలంలోనే బస ఉంటుంది.
(5 / 7)
3వ రోజు ఉదయం టిఫిన్ పూర్తి కాగానే అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు బయలు దేరుతారు. సాయంత్రం దర్శనం పూర్తి అవుతుంది. వెంటనే తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 4వ రోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది
(Image Source From Arunachalam Temple FB Page)(6 / 7)
హైదరాబాద్ - అరుణాచంల ట్రిప్ ధరలు : పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్స్ కవర్ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతంగా ఖర్చు భరించాల్సి ఉంటుంది.
(image source from @hinduacademy X )ఇతర గ్యాలరీలు