తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism : హైదరాబాద్ నుంచి షిర్డీకి ఫ్లైట్ జర్నీ ప్యాకేజీ - దర్శనం, ధరల వివరాలివే
- Telangana Tourism Hyderabad - Shirdi Tour : షిర్డీకి వెళ్లే వారి కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. ఫ్లైట్ జర్నీ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
- Telangana Tourism Hyderabad - Shirdi Tour : షిర్డీకి వెళ్లే వారి కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. ఫ్లైట్ జర్నీ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
(1 / 6)
షిర్డికి వెళ్లే భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ). గతంలో బస్సు జర్నీ ప్యాకేజీ మాత్రమే ఉండగా… ఈసారి విమాన ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
(2 / 6)
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా.... ప్రతిరోజూ హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ ద్వారా షిర్డీకి తీసుకెళ్తారు. ఇందులో టికెట్ ధర రూ.12,499గా ప్రకటించారు. (unsplash.com)
(3 / 6)
ప్రతిరోజు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి... 2.30 గంటలకు షిర్డీ చేరుకుంటారు.(unsplash.com)
(4 / 6)
వెళ్లిన రోజు సాయంత్రమే 4.30 గంటలకు షిర్డీ సాయిబాబు దర్శనం పూర్తి అవుతుంది. రాత్రి 7 గంటలకు బాబా థీమ్ పార్కులోని సౌండ్, లైట్ షోను వీక్షిస్తారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం చేసుకుంటారు.(unsplash.com)
(5 / 6)
రెండో రోజు మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో తిరిగి ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com)
ఇతర గ్యాలరీలు