Telangana Tourism : : ఈ సీజన్ లో 'అనంతగిరి హిల్స్'ను చూడాల్సిందే..! రూ.1800కే వన్ డే టూర్ స్పెషల్ ప్యాకేజీ, వివరాలివే
- Ananthagiri Hills Tour : అరకు లోయ అందాలను తలపించే అనంతగిరి హిల్స్ చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. శనివారం, ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలను ఈ కథనలో చూడండి...
- Ananthagiri Hills Tour : అరకు లోయ అందాలను తలపించే అనంతగిరి హిల్స్ చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. శనివారం, ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలను ఈ కథనలో చూడండి...
(1 / 6)
అరకు లోయను తలపించే అనంతగిరి హిల్స్ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండే ఓ అద్భుతమైన ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే...ఈ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా అభివర్ణించవచ్చు.(Image Source Twitter)
(2 / 6)
అనంతగిరిలోని ఇక్కడి పచ్చదనం, లోయలు, జలపాతాలు చూస్తే... ప్రతి మనసును కట్టిపడేస్తాయి. మిగతా సమయంలో కంటే ప్రస్తుత సీజన్ లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. వర్షాలకు అడవి మొత్తం పచ్చగా కనిపిస్తుంది. కనుచూపు మేర రమణీయంగా కనిపిస్తుంది.
(3 / 6)
ఈ అద్భుతమైన ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తుంది. వీకెండ్స్ శనివారం, ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.HYDERABAD TO ANANTHAGIRI BACK ONE DAY PACKAGE TOUR’ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.(Image Source @DrRanjithReddy Twitter)
(4 / 6)
తెలంగాణ టూరిజం తెలిపిన వివరాలన ప్రకారం…ఉద.యం 9 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతగిరి చేరుకుంటారు. మొదటగా అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. 12.30 PM to 01.30 PM - ఫారెస్ట్ విజిట్ ఉంటుంది.01.30 PM to 02.30 PM - హరిత హోటల్ లో లంచ్ ఉంటుంది. 02.30 PM to 04.30 PM - గేమ్స్ ఉంటాయి. 04.30 PM to 05.00 PM - టీ, స్నాక్స్ ఇస్తారు.05.00 PM - అనంతగిరి నుంచి బయల్దేరుతారు. 8.00 PM - హైదరాబాద్ చేరుకోవటంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.(Image Source Twitter)
(5 / 6)
హైదరాబాద్ - అనంతగిరి టికెట్ ధరలు: పెద్దలకు రూ. 1800, పిల్లలకు రూ. 1440గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.(Image Source Twitter)
ఇతర గ్యాలరీలు