తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala Tour Package : హైదరాబాద్ టు తిరుమల టూర్ ప్యాకేజీ - ఉచితంగా శ్రీవారి శీఘ్ర దర్శనం, ఈనెలలోనే ట్రిప్..!
- Telangana Tourism Tirumala Tour : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇందులో శ్రీవారి శీఘ్ర దర్శనం ఉచితంగా లభిస్తోంది.
- Telangana Tourism Tirumala Tour : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇందులో శ్రీవారి శీఘ్ర దర్శనం ఉచితంగా లభిస్తోంది.
(1 / 7)
తిరుమల తిరుపతి... ప్రపంచంలో అత్యంత పేరు గాంచిన అధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా పేరొందింది. తిరుమల శ్రీవారి దర్శనం మహాభాగ్యమన్నట్లు భక్తులు ఆయన చెంతకు వెళ్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉంటారు. అయితే తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. (Image Source TTD)
(2 / 7)
నిర్దిష్ట సమయంలోపు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోని తిరిగి రావాలనుకునే వారికి ఈ ప్యాకేజీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. పైగా ధర కూడా తక్కువగానే ఉంది.కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ట్రిప్ పూర్తి అవుతుంది. (Image Source TTD)
(3 / 7)
ఈ ప్యాకేజీ షెడ్యూల్ లో భాగంగా… బుకింగ్ చేసుకునే టూరిస్టులు బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి జర్నీస్టార్ట్ అవుతుంది. కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి. (Image Source TTD)
(4 / 7)
టూర్ షెడ్యూల్ ప్రకారం… సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374). రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఆ తర్వాత స్థానికంగా ఉండే ఆలయాలను చూస్తారు. తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడ ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.మరునాడు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. (Image Source TTD)
(5 / 7)
ఈ ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవని టూరిజం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని విస్మరించవద్దని కోరుతున్నారు. (Image Source TTD)
(6 / 7)
తిరుమల టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 3,700, చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.ఈ ప్యాకేజీని 7 రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బుకింగ్ ప్రాసెస్ ముందుకు సాగదు. ఏసీ, నాన్ ఏసీ బస్సు సర్వీస్ ను కూడా ఎంచుకోవచ్చు. (Image Source TTD)
ఇతర గ్యాలరీలు