Nagarjuna Sagar Tour Package : రూ. 800కే 'సాగర్' ట్రిప్ - బోటింగ్ తో పాటు బుద్ధవనం చూడొచ్చు, వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే-telangana tourism operate one day nagarjuna sagar tour package from hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nagarjuna Sagar Tour Package : రూ. 800కే 'సాగర్' ట్రిప్ - బోటింగ్ తో పాటు బుద్ధవనం చూడొచ్చు, వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే

Nagarjuna Sagar Tour Package : రూ. 800కే 'సాగర్' ట్రిప్ - బోటింగ్ తో పాటు బుద్ధవనం చూడొచ్చు, వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే

Published Jun 02, 2024 01:15 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 02, 2024 01:15 PM IST

  • Telangana Tourism Nagarjuna Sagar Tour: నాగార్జున సాగర్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ముగుస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ చదవండి…..

నాగార్జున సాగర్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

(1 / 7)

నాగార్జున సాగర్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

(Photo Source @tstdcofficial Twitter)

కేవలం ఒకే ఒక్క రోజులోనే సాగర్ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్తారు.

(2 / 7)

కేవలం ఒకే ఒక్క రోజులోనే సాగర్ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్తారు.

(Photo Source @tstdcofficial Twitter(ఫైల్ ఫొటో))

ఈ ప్యాకేజీ షెడ్యూల్ చూస్తే…. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ పర్యాటక భవన్ నుండి, 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు

(3 / 7)

ఈ ప్యాకేజీ షెడ్యూల్ చూస్తే…. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ పర్యాటక భవన్ నుండి, 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది.

 ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు

(Photo Source @tstdcofficial Twitter)

ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. . త‌ర్వాత‌ లంచ్ బ్రేక్ ఉంటుంది. 

(4 / 7)

ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. . త‌ర్వాత‌ లంచ్ బ్రేక్ ఉంటుంది. 

(Photo Source @tstdcofficial Twitter)

ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. 

(5 / 7)

ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. 

(Photo Source @tstdcofficial Twitter)

సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను సంద‌ర్శ‌ిస్తారు. 5 గంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ వన్ డే టూర్ ముగుస్తుంది.

(6 / 7)

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 800, పిల్లలకు 640గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

(7 / 7)

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 800, పిల్లలకు 640గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

(Photo Source @tstdcofficial Twitter)

ఇతర గ్యాలరీలు