Telangana Tourism Package : రూ. 3 వేలకే ‘షిర్డీ’ ట్రిప్ - ఎల్లోరా కేవ్స్‌తో పాటు మిని తాజ్‌మహల్ చూడొచ్చు, వివరాలివే
- Telangana Tourism Shirdi Ellora Tour : షిర్డీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. 4 రోజల షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడండి….
- Telangana Tourism Shirdi Ellora Tour : షిర్డీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. 4 రోజల షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడండి….
(1 / 6)
అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం మరో సూపర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం 3 వేల ధరలోనే షిర్డీ, ఎల్లోరా(Shirdi Ellora Tour) ట్రిప్ ను ప్రకటించింది. మొత్తం 4 రోజుల పాటు టూర్ కొనసాగుతుంది.
(image source from unsplash.com)(2 / 6)
ఈ షిర్డీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. బస్సు జర్నీ చేయాల్సి ఉంటుంది. షిర్డీ సాయి బాబా(Shirdi) దర్శనంతో పాటు మరిన్ని ప్రాంతాలను చూడాల్సి ఉంటుంది.
(image source from unsplash.com)(3 / 6)
Shirdi Ellora Tour - Telangana Tourism పేరుతో తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ప్రతి బుధ, శుక్రవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
(image source from unsplash.com)(4 / 6)
Day - 1 హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయల్దేరుతారు. ఉదయం షిర్డీకి చేరుకుంటారు. శనిశిగ్నాపూరం, షిర్డీ దర్శనం పూర్తి అవుతుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
(image source from unsplash.com)(5 / 6)
Day - 3 - షిర్డీ నుంచి బయల్దేరి… ఎల్లోరా కేవ్స్ కు వెళ్తారు. దారి మధ్యలో ఔరంగాబాద్ లోని మినీ తాజ్ మహల్ ను కూడా చూస్తారు. Day - 4 - ఉదయం 6 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. ఏసీ, నాన్ ఏసీ కోచ్ అనేది మీరు ఏంచుకోవాల్సి ఉంటుంది. దాని బట్టి ధరలు ఉంటాయి.
(image source from unsplash.com)(6 / 6)
టికెట్ ధర పెద్దలకు రూ. 3550, పిల్లలకు రూ. 2890గా నిర్ణయించారు. నాన్ ఏసీ కోచ్ లో అయితే పెద్దలకు రూ.3100, పిల్లలకు రూ.2530గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 నెంబర్ ను సంప్రదించవచ్చు. ఈ ప్యాకేజీని https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
(image source from unsplash.com)ఇతర గ్యాలరీలు