Somasila Tour Package : హైదరాబాద్ టూ సోమశిల - శ్రీశైలం నుంచి బోట్ జర్నీ, ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ చూడండి
- Telangana Tourism Somasila Tour : హైదరాబాద్ నుంచి శ్రీశైలం - సోమశిల టూర్ ప్యాకేజీ వచ్చింది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది. 2 రోజుల పాటు టూర్ షెడ్యూల్ ఉంటుంది. మిగతా వివరాలను ఇక్కడ చూడండి….
- Telangana Tourism Somasila Tour : హైదరాబాద్ నుంచి శ్రీశైలం - సోమశిల టూర్ ప్యాకేజీ వచ్చింది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది. 2 రోజుల పాటు టూర్ షెడ్యూల్ ఉంటుంది. మిగతా వివరాలను ఇక్కడ చూడండి….
(1 / 6)
తెలంగాణ టూరిజం(Telangana Tourism). Srisailam - Somasila Road cum River Cruise Tour పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.
(image source from @tstdcofficial)(2 / 6)
హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి శనివారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది. 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
(image source from @tstdcofficial)(3 / 6)
నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం చేరుకొని… రాత్రి అక్కడే బస చేస్తారు.
(image source from @tstdcofficial)(4 / 6)
ఇక రెండో రోజు శ్రీశైలం నుంచి బయల్దేరి.. సోమశిల చేరుకుంటారు. ఇక్కడ క్రూజ్ బోట్ ద్వారా జర్నీ ఉంటుంది. ఈ జర్నీ మాటల్లో చెప్పలేం. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ జర్నీ చేసి తీరాల్సిందే అన్నట్టు ఉంది. ఇక బోట్ లో మీల్స్ ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.
(image source from @tstdcofficial)(5 / 6)
హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3600గా ఉంది.
(image source from @tstdcofficial)(6 / 6)
ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
(image source from @tstdcofficial)ఇతర గ్యాలరీలు