Papikondalu Tour Package : పాపికొండలు ట్రిప్ - గోదావరి అలలపై బోట్ జర్నీ..! తెలంగాణ టూరిజం ప్యాకేజీ వచ్చేస్తోంది..!
- TG Tourism Papikondalu Tour Package: ఇటీవలనే పాపికొండలు టూర్ ప్రారంభమైంది. పర్యాటకులను బోట్లలో పాపికొండల ట్రిప్ నకు అనుమతిస్తున్నారు. ఏపీ టూరిజం ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఇక తెలంగాణ టూరిజం కూడా త్వరలోనే ఈ ట్రిప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు షురూ చేసింది. తాజా వివరాలను ఇక్కడ చూడండి..
- TG Tourism Papikondalu Tour Package: ఇటీవలనే పాపికొండలు టూర్ ప్రారంభమైంది. పర్యాటకులను బోట్లలో పాపికొండల ట్రిప్ నకు అనుమతిస్తున్నారు. ఏపీ టూరిజం ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఇక తెలంగాణ టూరిజం కూడా త్వరలోనే ఈ ట్రిప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు షురూ చేసింది. తాజా వివరాలను ఇక్కడ చూడండి..
(1 / 7)
ఏపీలో గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు బోట్ ట్రిప్ ఇటీవలనే ప్రారంభం అయ్యింది. ఏపీ టూరిజం ప్యాకేజీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. టూరిస్టులు బుకింగ్స్ చేసుకొని వెళ్తున్నారు.
(2 / 7)
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు టూర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా...పాపికొండల మధ్య గోదావరిలో సాగే ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను మంత్రమగ్ధులను చేస్తుంది. ఇక్కడికి భద్రాచలం నుంచి చేరుకోవచ్చు.
(image source @tgtdcofficial)(3 / 7)
పాపికొండలు టూర్ ప్రారంభమైన నేపథ్యంలో.. తెలంగాణ టూరిజం కూడా ప్యాకేజీని ఆపరేట్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి బోట్ అనుమతులు రాగానే ప్రారంభించేందుకు సిద్ధమైంది.
(image source @tgtdcofficial)(4 / 7)
బోట్ అనుమతులు రాగానే వచ్చే నవంబర్ నెల నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై హిందుస్తాన్ టైమ్స్ తెలుగు… తెలంగాణ టూరిజం అధికారులతో మాట్లాడింది. బోట్ అనుమతులు రావాల్సి ఉందని, ఆ వెెంటనే ప్యాకేజీని ఆపరేట్ చేస్తామని చెప్పారు.
(image source @tgtdcofficial)(5 / 7)
పాపికొండల చూసేందుకు తెలంగాణ టూరిజం “PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR ” పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తూ వచ్చింది. ఇదే ప్యాకేజీలో మరికొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తీసుకురానుంది.
(image source @tgtdcofficial)(6 / 7)
తెలంగాణ టూరిజం ఆపరేట్ చేసే పాపికొండలు టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. మొత్తం మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. బస్సులో రోడ్డు మార్గం ద్వారా జర్నీ ఉంటుంది. గోదావరి అలలపై బోటింగ్ ఉంటుంది. పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకొని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పొచారానికి బోట్ లో జర్నీ ఉంటుంది. లంచ్ తో పాటు స్నాక్స్ ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్ లో బస చేస్తారు. పర్ణశాలకు కూడా వెళ్తారు.
(image source @tgtdcofficial)(7 / 7)
మొన్నటి వరకు పాపికొండలు వెళ్లేందుకు ఆపరేట్ చేసిన ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు 6999గా నిర్ణయించారు. పిల్లలకు 5599గా ఉంది . నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. తాజాగా రాబోయే టూర్ ప్యాకేజీ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీ అప్డేట్స్ గురించి https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. కేవలం పాపికొండలే కాకుండా.. మరికొన్ని టూర్ ప్యాకేజీల వివరాలను కూడా ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
(image source @tgtdcofficial)ఇతర గ్యాలరీలు