TET Results 2025 Telangana: తెలంగాణ టెట్ ఫలితాలపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్...! తాజా అప్డేట్స్ ఇవిగో
- TET Results 2025 Telangana: తెలంగాణ టెట్ ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి అయింది.
- TET Results 2025 Telangana: తెలంగాణ టెట్ ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి అయింది.
(1 / 8)
తెలంగాణ టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఇటీవలే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఫలితాల విడుదలపై ప్రభావం పడింది.
(2 / 8)
ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ఇటీవలనే షెడ్యూల్ విడుదల కాగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇవాళ టెట్ ఫలితాలు విడుదలవుతాయా..? లేదా..? అన్నదానిపై డైలామా నెలకొంది
(3 / 8)
ఎన్నికల కోడ్ రాకపోతే ఇవాళే ఫలితాలు విడుదలయ్యేవి. కానీ కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇదే విషయంపై అధికారుల కూడా కసరత్తు చేస్తున్నారు.
(image source unsplash.com)
(4 / 8)
ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదలపై విద్యాశాఖ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఫలితాల విడుదలకు ఈసీకి లేఖ రాసి అనుమతి కోరే అవకాశాలు ఉన్నాయి.
(5 / 8)
ఉత్తర తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన జరగనుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. అయితే విద్యాశాఖ విజ్ఞప్తి మేరకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…. టెట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అవుతుంది. అలా కాకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆగాల్సిందే అంటే… మార్చి 3 తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
(6 / 8)
ఈ ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కూడా ఎదురుచూస్తున్నారు.
(7 / 8)
ప్రిలిమినరీ కీలపై జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విద్యాశాఖ అభ్యంతరాలను స్వీకరించింది. దాదాపు అన్ని ప్రక్రియలు ముగియగా… కేవలం తుది ఫలితాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది.
(8 / 8)
టెట్ తుది ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లేదా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్, జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు