(1 / 7)
తెలంగాణ టెట్ పరీక్షల(జూన్ 2025) షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ బుధవారం టెట్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం జూన్ 18వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
(2 / 7)
తెలంగాణ టెట్ 2025 (జూన్ సెషన్) షెడ్యూల్ వివరాల ప్రకారం.... జూన్ 30వ తేదీతో అన్ని పరీక్షలు ముగుస్తాయి. మొత్తం 16 రోజులు జరుగుతాయి. ప్రతి రోజూ రెండు సెషన్లు ఉంటాయి.
(3 / 7)
జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.
(4 / 7)
జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.
(5 / 7)
ఇక తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(6 / 7)
ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్-1కు 63,261 , పేపర్-2కు 1,20,392 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
(7 / 7)
టెట్ అభ్యర్థులు file:///C:/Users/D111636/Downloads/Schedule%20TGTET-June-2025.pdf లింక్ పై క్లిక్ చేసి పరీక్షల షెడ్యూల్ పీడీఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 22వ తేదీన టెట్ తుది ఫలితాలను విడుదల చేస్తారు.
(image source unsplash.com)ఇతర గ్యాలరీలు