(1 / 7)
వానాకాలం సీజన్ రావటంతో రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈసారి తొందరగానే విడుదల చేయాలని భావిస్తోంది.వచ్చే వారం నుంచి నిధుల విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
(2 / 7)
వానాకాలం సీజన్ రావటంతో రైతన్నలు ఇప్పటికే సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. సాగుబాటు చేస్తూ… విత్తనాలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో పంటపెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ముందుగానే నిధులను జమ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
(image source unsplash)(3 / 7)
రైతు భరోసా స్కీమ్ పై ఇటీవలే ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించింది. అయితే నిధుల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వచ్చే వారంలోనే నిధుల విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేయనున్నారు. అన్ని కుదిరితే జూన్ 16వ తేదీన ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
(image source .istockphoto.com)(4 / 7)
ఈనెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం వేదికగా పలు జిల్లాల రైతులతో
మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు వేదికల్లో కూడా ప్రత్యక్షప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
(5 / 7)
మరోవైపు రైతు భరోసా స్కీమ్ కు సంబంధించి తెలంగాణ వ్యవసాయశాఖ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులపై ప్రకటన చేసింది. 05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
(6 / 7)
కొత్తగా అప్లికేషన్ చేసుకునేవాళ్లు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది.
(image source unsplash.com)(7 / 7)
రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.
ఇతర గ్యాలరీలు