(1 / 6)
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గట్టి షాక్ ఇచ్చింది. బస్ పాస్ రేట్లను పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు(జూన్ 09) నుంచి అమల్లోకి వచ్చాయి.
(2 / 6)
గతంలో ఉన్న ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1,150 గా ఉంటే… రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధరను రూ.1,600కు పెంచారు.
(3 / 6)
అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను రూ.1,800గా అయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరల్లో కూడా మార్పులు వచ్చాయి.
(4 / 6)
బస్ పాస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఇలాంటి వేళ పాస్ ధరలు పెరిగితే… ఆర్థిక భారం ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(5 / 6)
బస్ పాస్ రేట్లు, మెట్రో టికెట్ రేట్లు పెరగడంపై విద్యార్థులు మాత్రమే కాదు… సామాన్య ప్రజలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
(6 / 6)
బస్ పాస్ రేట్ల పెంపుపై ఆర్టీసీ మరోసారి ఆలోచన చేయాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు.
ఇతర గ్యాలరీలు