(1 / 7)
రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే… అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ పథకానికి అన్ని జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు అందాయి. ఏకంగా 16 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకోవటంతో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
(2 / 7)
ప్రస్తుతం మండల స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుండగా… ఆపై జిల్లా కమిటీలకు సిఫార్సు చేస్తున్నారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను వెల్లడిస్తారు. జూన్ 2వ తేదీ నుంచి శాంక్షన్ లెటర్లు కూడా పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా సాగుతోంది.
(3 / 7)
ఇక దరఖాస్తుదారుల్లో అనర్హులను పక్కనపెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అధికారులు వినియోగిస్తున్నారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లలో కార్పొరేషన్ కింద ఏమైనా రుణాలు, స్కీమ్ లు పొందరా..? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. నిజానికి ఏదైనా సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందినవారు ఐదేళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు. కాబట్టి ఇలాంటి వారి విషయంలో ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
(4 / 7)
బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్‌తో పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలనే ఇచ్చారా వంటి అంశాలను చూస్తున్నారు. కుటుంబానికి ఒక్కరికే శాంక్షన్ లెటర్ మంజూరు అవుతుంది. ఈ కోణంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు.
(5 / 7)
దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్ ఇవ్వొద్దని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.
(image source istockphoto)(6 / 7)
దరఖాస్తుదారుల బ్యాంక్ లావాదేవీల పరిశీలనతో పాటు పాన్ కార్డు ద్వారా మరిన్ని వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. గతంలో ఏమైనా రుణాలు తీసుకున్నారా..? తీసుకుంటే ఏ విధంగా రుణాల చెల్లింపు ప్రక్రియ జరిగింది..? వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకర్లు వైపు నుంచి పకడ్బందీగా ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుంది.
(7 / 7)
రాజీవ్ యువవికాసం పథకం కింద తొలిఏడాది 5 లక్షల మందికి మంజూరుపత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేస్తారు. మే 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా సంక్షేమ శాఖలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు