(1 / 8)
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను అమలు చేస్తోంది.
(image source istockphoto)(2 / 8)
రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే… అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ పథకానికి అన్ని జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు అందాయి. ఏకంగా 16 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకోవటంతో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
(3 / 8)
చాలా జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా… జూన్ 2వ తేదీన 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్లను ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రకటించారు.
(4 / 8)
రాజీవ్ యువ వికాసం స్కీం కోసం రూ.9 వేల కోట్లు కేటాయించగా.. రూ. 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. అయితే ముందుగా కేటగిరీ-1, 2 యూనిట్లను కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. ఆ తర్వాత కేటగిరి 3, 4లో ఉన్న వారికి శాంక్షన్ లెటర్లు అందజేయనుంది.
(5 / 8)
మే 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఆయా కార్పొరేషన్ల అనుమతితో శాంక్షన్ లెటర్లను సిద్ధం చేయనున్నారు.
(6 / 8)
కేటగిరి 1 కింద రూ. 50 వేల రుణం ఉండదా… కేటగిరి 2 కింద రూ. 1 లక్షలోపు యూనిట్లు ఉన్నాయి. ముందుగా కేటగిరి 1, 2లోని లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు అందించాలనే యోచనలో సర్కార్ ఉంది.
(7 / 8)
ఇక దరఖాస్తుదారుల్లో అనర్హులను పక్కనపెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అధికారులు వినియోగిస్తున్నారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లలో కార్పొరేషన్ కింద ఏమైనా రుణాలు, స్కీమ్ లు పొందరా..? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.
(8 / 8)
దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్ ఇవ్వొద్దని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.
ఇతర గ్యాలరీలు