వేసవి సెలవుల్లో ఊరెళ్తున్నారా.. ఇల్లు జర జాగ్రత్త గురూ.. ఈ విషయాలు మర్చిపోవద్దు!-telangana police advice to those going on summer vacation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వేసవి సెలవుల్లో ఊరెళ్తున్నారా.. ఇల్లు జర జాగ్రత్త గురూ.. ఈ విషయాలు మర్చిపోవద్దు!

వేసవి సెలవుల్లో ఊరెళ్తున్నారా.. ఇల్లు జర జాగ్రత్త గురూ.. ఈ విషయాలు మర్చిపోవద్దు!

Published Apr 29, 2025 12:31 PM IST Basani Shiva Kumar
Published Apr 29, 2025 12:31 PM IST

ఇటీవల దొంగతనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువ జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వేసవి సెలవుల్లో టూర్‌లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో విలువైన ఆభరణాలు, డబ్బులు పెట్టొద్దని సూచిస్తున్నారు. తాళాలు లోపలివైపు వేస్తే మంచిదని స్పష్టం చేస్తున్నారు.

వేసవి కాలంలో దొంగతనాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సెలవులు రావడంతో చాలామంది బంధువుల ఇళ్లకు, తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన నగలు, నగదు అపహరణకు గురవుతుండటంతో.. చాలామంది రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పోలీసులు చెబుతున్నారు.

(1 / 6)

(unsplash)

వేసవి కాలం కావడంతో ఉక్కపోత కారణంగా చాలా మంది ఇంటి స్లాబ్‌పై పడుకుంటారు. ఇంకొందరు ఇంటి ఆవరణలో పడుకుంటారు. ఇలాంటి ఇళ్లలోనూ దొంగలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇంటి ప్రధాన గేటుకు లోపలి వైపు నుంచి తాళాలు వేసుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

(2 / 6)

విలువైన ఆభరణాలను ఇంట్లో పెట్టుకోవద్దని పోలీసులు చెబుతున్నారు. సమీపంలోని బ్యాంకు లాకర్లలో భద్రపరిస్తే నిశ్చింతగా ఉండొచ్చని స్పష్టం చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు.. ఎంచుకున్న లాకర్‌ పరిమాణాన్ని, బ్యాంకులను బట్టి ఛార్జీలు ఉంటాయి.. ఇది అంత భారం కాదని వివరిస్తున్నారు.

(3 / 6)

ఊర్లకు వెళ్తున్న క్రమంలో ఇంటి గేటుకు తాళం వేస్తే.. దొంగలు కన్నం వేస్తుంటారు. గేటుకు లోపలి వైపు తాళం వేయాలి. ఉంటే ద్వారానికి బయటకు కనిపించకుండా తాళాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి లోపలి ఆవరణలో లైట్లు వేసి ఉంచాలి. ద్వారం వద్ద చెప్పులు ఉంచడం కూడా మంచిదని పోలీసులు చెబుతున్నారు.

(4 / 6)

వేరే ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో ఇంటి వద్ద పాల ప్యాకెట్లు, వార్త పత్రికలు, వేసే వాళ్లకు రావద్దని చెప్పాలి. న్యూస్‌పేపర్‌ ఇంటి ముందు ఉండటంతో ఇంట్లో ఎవరూ లేరని దొంగలు గుర్తించే ప్రమాదం ఉంది. ఊరికి వెళ్లే క్రమంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే.. పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ నిఘా పెడతారు.

(5 / 6)

చాలామంది సీసీ కెమెరాలపై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో చోరీలు జరిగినా పోలీసులకు ఆధారాలు దొరకడం లేదు. ఫలితంగా దర్యాప్తులో ఆలస్యం జరుగుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇంటి వద్దకు ఎవరెవరు వస్తున్నారో సెల్ ఫోన్‌లో చూసుకోవచ్చు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు