కొత్త రేషన్ కార్డుదారుల ఫోన్లకు మెసేజ్‌లు...! ఈ తాజా అప్డేట్ తెలుసా-telangana new ration card holders will receive messages latest updates ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొత్త రేషన్ కార్డుదారుల ఫోన్లకు మెసేజ్‌లు...! ఈ తాజా అప్డేట్ తెలుసా

కొత్త రేషన్ కార్డుదారుల ఫోన్లకు మెసేజ్‌లు...! ఈ తాజా అప్డేట్ తెలుసా

Published May 23, 2025 07:55 PM IST Maheshwaram Mahendra Chary
Published May 23, 2025 07:55 PM IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. అయితే కొత్తగా కార్డు వచ్చిన వాళ్లకు పౌరసఫరాల శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త కార్డుదారులకు మే 25వ తేదీ నుంచి మేసేజ్ లు వస్తాయని తెలిపింది. వీరందరికీ వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించింది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఓవైపు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా... మరోవైపు అఫ్రూవ్ అయిన వారికి కార్డులను మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రేషన్ కూడా పొందుతున్నారు.

(1 / 9)

రాష్ట్రంలో ఇప్పటివరకు 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. కార్డులు మంజూరైన వారికి మే 25వ తేదీ నుంచి నుంచి వారి మొబైల్ లకు మెసేజ్ లు వస్తాయని పేర్కొంది.

(2 / 9)

కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం అందజేస్తామని పౌరసరఫరాల శాఖ వివరించింది. గ్రామసభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపింది.

(3 / 9)

కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో 3 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారని పౌరసఫరాల శాఖ ప్రకటించింది. వీరికి నెలకు 1.89 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుందని అంచనా వేసింది.

(4 / 9)

రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి అర్హత గల వారు కొత్త కార్డుల విషయంలో ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. నిరంతరం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని… ఆపై వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని చెబుతున్నారు.

(5 / 9)

కొత్త రేషన్ కార్డు పొందినవాళ్లు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారు... వారి వివరాలను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/  వెబ్ సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్ సీ సెర్చ్ పై క్లిక్ చేయాలి.

(6 / 9)

ఇక్కడ రేషన్ కార్డు సెర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే FSC సెర్చ్ అనే ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి FSCRefNo నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేసి జిల్లాను ఎంచుకోవాల్లి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలను కింద డిస్ ప్లే అవుతాయి.

(7 / 9)

ఇక తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నారు.  2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు.

(8 / 9)

తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు సన్నబియ్యం స్కీమ్ అర్హులవుతారు. అంతేకాకుండా తెలంగాణ నివాసి అయి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి.

(9 / 9)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు