AP TG Weather Updates : రెయిన్ అలర్ట్..! మరో 4 రోజులపాటు భారీ వర్షాలు, ఈ 11 జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 26వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో ఐఎండీ రెయిల్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(2 / 6)
ఏపీలో రేపు(ఆగస్టు 23) చూస్తే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
రేపు శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అనకాపల్లి, పశ్చిమగోదావరి,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి,వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
తెలంగాణలో చూస్తే... నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
(5 / 6)
ఆగస్టు 26వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు