Telangana Weather Updates : తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు...! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Telangana Weather Updates : తెలంగాణలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తాజా వెదర్ ఆప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana Weather Updates : తెలంగాణలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తాజా వెదర్ ఆప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 7)
బంగాళాఖాతంలో జూన్ (26)న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో 26న ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో , 27,28వ తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.
(Image Source from https://unsplash.com/)(2 / 7)
ఇవాళ హైదరాబాద్ లో చూస్తే... తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లలు పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో గంటకు 10 -12 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
(Image Source from https://unsplash.com/)(3 / 7)
ఇక ఇవాళ తెలంగాణలో చూస్తే.. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
జూన్ 30వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(Image Source from https://unsplash.com/)(5 / 7)
ఇక ఏపీలో రానున్న మూడు రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు ఊదురుగాలులు వీస్తాయని అధికారుల చెబుతున్నారు.
(6 / 7)
ఇవాళ( బుధవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల వైయస్ఆర్, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు