AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... ఇవాళ, రేపు భారీ వర్షాలు..! ఈ 6 జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Weather Updates : ఏపీ తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : ఏపీ తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.(image source @APSDMA twitter)
(2 / 6)
ఇవాళ(ఆగస్టు 07) ఏపీలోని మన్యం, అల్లూరి,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. (image source @APSDMA twitter)
(3 / 6)
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. (image source @APSDMA twitter)
(4 / 6)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (image source @APSDMA twitter)
(5 / 6)
ఇదే సమయంలో సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. (image source @APSDMA twitter)
ఇతర గ్యాలరీలు