తెలుగు న్యూస్ / ఫోటో /
TG Assembly Special Session : రేపు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం - కారణం ఏంటంటే..
- Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ సోమవారం(డిసెంబర్ 30) ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించనుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు శనివారం లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. సభ ఏర్పాట్లను స్పీకర్ పరిశీలించారు.

(1 / 6)
తెలంగాణ అసెంబ్లీ సోమవారం(డిసెంబర్ 30) ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించనుంది.
(2 / 6)
ప్రత్యేక సమావేశం నేపథ్యంలో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు శనివారం లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. సభ ఏర్పాట్లను ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు.(https://legislature.telangana.gov.in/)
(4 / 6)
సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డిజిపి, పోలీస్ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో స్పీకర్ మాట్లాడారు.
(5 / 6)
గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని స్పీకర్ సూచించారు.సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇతర గ్యాలరీలు