(1 / 7)
న్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు...ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
(2 / 7)
అయితే ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు దగ్గరపడింది. ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటే నిర్ణయించిన ఫీజుతోనే ప్రాసెస్ చేసుకోవచ్చు. గడువు దాటితే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
(3 / 7)
జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి.
(4 / 7)
గడువు దాటితే మే 5 వరకు రూ. 1,000 ఆలస్యం రుసం, మే 15 వరకు రూ.2,000, మే 25 వరకు రూ.4,000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
(5 / 7)
ఇక దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ మే 20, 2025 నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 25, 2025 వరకు అవకాశం ఉంటుంది. 30 మే 2025వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి.
(6 / 7)
టీజీ లాసెట్ 2025 ప్రవేశ పరీక్ష 6 జూన్ 2025వ తేదీన జరుగుతుంది. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ నిర్వహిస్తారు.
(7 / 7)
తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్ సైట్ https://lawcet.tgche.ac.in/HOMEPAGE.aspx లోకి వెళ్లి ఫీజు చెల్లించటంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు