AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... ఈ తేదీల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన, హెచ్చరికలు జారీ
- AP Telangana Weather Updates : తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఓవైపు భానుడి భగభగలు పెరుగుతుండగా… మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
(unshplash.com)(2 / 6)
కేరళ, తమిళనాడులో మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని వాతావరణశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది.
(@APSDMA Twitter)(3 / 6)
ఇక ఇవాళ తెలంగాణ ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో రెండు మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
(unshplash.com)(4 / 6)
జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(@APSDMA Twitter)(5 / 6)
తెలంగాణ ప్రాంతంలో జూన్ 6వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
(@APSDMA Twitter)ఇతర గ్యాలరీలు