TG Inter Exam Results 2025 : 4 విడతలు, 19 కేంద్రాలు...! ఈనెల 10 నుంచే 'ఇంటర్' స్పాట్ వాల్యుయేషన్
- Telangana Inter Spot Valuation 2025: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ పరీక్షలన్నీ కలిపి… మార్చి 25వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. ఇదిలా ఉంటే… ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. జవాబు పత్రాల స్పాట్ మూల్యాంకనం కోసం షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
- Telangana Inter Spot Valuation 2025: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ పరీక్షలన్నీ కలిపి… మార్చి 25వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. ఇదిలా ఉంటే… ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. జవాబు పత్రాల స్పాట్ మూల్యాంకనం కోసం షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 7)
తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 25 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9 లక్షలకుపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 1,532 కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.
(2 / 7)
ఓవైపు పరీక్షలు ప్రారంభం కాగా… మరోవైపు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం షెడ్యూల్ ను ప్రకటించింది. ఇంటర్ బోర్డు వివరాల ప్రకారం… మార్చి 10వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
(3 / 7)
మొత్తం 4 విడతల్లో స్పాట్ ను పూర్తి చేయనున్నారు. మార్చి 10 నుంచి సంస్కృతం పేపర్ I, II తో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత… ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఈ ప్రక్రియ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
(4 / 7)
మార్చి 24 నుంచి సెకండ్ స్పెల్ స్పాట్ ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్ - I మరియు II మూల్యాంకనం ఉంటుంది. మార్చి 26 నుండి మూడవ స్పెల్‌లో కెమిస్ట్రీ, కామర్స్ I మరియు II పేపర్‌ల మూల్యాంకనం చేయబడుతుంది.
(5 / 7)
చివరగా మార్చి 28వ తేదీ నుంచి హిస్టరీ పేపర్ I, II వృక్షశాస్త్రం, జంతుశాస్త్ర సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే... మార్కులను ఎంట్రీ చేస్తారు. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులు కూడా ఉంటారు. విద్యాశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే… ఫలితాలను ప్రకటిస్తారు.
(6 / 7)
ఈసారి రాష్ట్రంలో స్పాట్ ఎవాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది 17 మాత్రమే ఉండగా.. ఈసారి 19కి పెంచారు. హైదరాబాద్, వరంగల్, మెదక్ సహా పలు ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు