(1 / 9)
ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.తాజాగానే ఏపీ విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ తేదీలను కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో… తెలంగాణలోని విద్యార్థులు కూడా రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు.
(2 / 9)
2025 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ ఇంటర్ బోర్డు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసింది.
(3 / 9)
ప్రస్తుతం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)లో క్రోడీకరణ జరుగుతున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ అంతా కూడా వారం రోజుల లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే ఇతర అంశాలను కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించి…. ఫలితాలను విడుదల చేయనున్నారు.
(4 / 9)
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించారు.మొత్తం 9 లక్షల 96 వేల 971 మంది పరీక్షలు రాశారు. వీరితో పాటు తల్లిదండ్రులు కూడా ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
(5 / 9)
గత ఏడాదిలో చూస్తే తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. అయితే ఈసారి కూడా ఏప్రిల్ 25వ తేదీలోపే ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఏప్రిల్ 25వ తేదీనే రావొచ్చు. అన్ని కుదిరితే గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 24వ తేదీనే ఫలితాలను ఇవ్వటానికి ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి వాట్సాప్ కు పంపే ఏర్పాట్లను కూడా పరిశీలిస్తోంది. దీనిపై బోర్డు నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
(6 / 9)
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి.క్షణాల వ్యవధిలోనే మీ రిజల్ట్స్ ను తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వచ్చేస్తాయి.
(7 / 9)
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్ :
https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్
https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result
(istock.com)
(8 / 9)
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్ :
https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result
(9 / 9)
తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ ( https://tgbie.cgg.gov.in/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఫలితాల విడుదల రోజే సప్లిమెంటరీ పరీక్షల తేదీలతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలను కూడా బోర్డు అధికారులు ప్రకటిస్తారు.
ఇతర గ్యాలరీలు