TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ - ప్రత్యేక వెబ్‌సైట్ వచ్చేసింది, ఇదిగో లింక్
- Telangana Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. indirammaindlu.telangana.gov.in ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
- Telangana Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. indirammaindlu.telangana.gov.in ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 6)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత అర్హుల ఎంపిక ఉండనుంది. జనవరి 31వ తేదీలోగా జాబితాలను ప్రకటించే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది.
(2 / 6)
ఓవైపు ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుండగా… తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులకు ఏర్పాటుకు ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకుంది. ఈ మేరకు https://indirammaindlu.telangana.gov.in ప్రత్యేక వెబ్‌సైట్‌ను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ప్రారంభించారు.
(3 / 6)
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఉంటే indirammaindlu.telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్‌కు మెసేజ్ ద్వారా తెలిపేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి వివరాలను వెల్లడించారు.
(4 / 6)
ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారానే దరఖాస్తుదారుల వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను సేకరించి.. ఫొటోలను అప్ లోడ్ కూడా చేస్తున్నారు.
(5 / 6)
మరోవైపు ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గ్రామాలకు వెళ్లి మరీ వివరాలను ఎంట్రీ చేయించుకుంటన్నారు. ప్రజా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకోగా…ఇప్పటికే 65 లక్షల మంది వివరాలను యాప్ ద్వారా సేకరించారు. త్వరలోనే సర్వే మొత్తం పూర్తి కానుంది.
(6 / 6)
సర్వే తర్వాత గ్రామ సభ ఆమోదం అనంతరమే… ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు.ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.
ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు.
ఇతర గ్యాలరీలు