Telangana Land Values Hike : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపు - ఆగస్టు 1 నుంచే అమలు..!
- Telangana Land Values Hike : తెలంగాణలో భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఆగస్టు 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. సర్కార్ ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.
- Telangana Land Values Hike : తెలంగాణలో భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఆగస్టు 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. సర్కార్ ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.
(1 / 7)
తెలంగాణలో భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఆగస్టు 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. సర్కార్ ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.
(2 / 7)
మే 16వ తేదీన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనే భూముల విలువ పెంపుపై లోతుగా చర్చించారు. 2021లో చివరిసారిగా భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచినట్లు గుర్తు చేశారు. చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అభిప్రాయపడ్డారు రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని సూచించారు. భూముల మార్కెట్ విలువను సవరించాలని,,, దీనిపై కసరత్తు చేయాలని ఆదేోశించారు.(image source unshplash.com)
(3 / 7)
ముఖ్యమంత్రి ఆదేశాలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ధరల పెంపునకు సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 15వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం… ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.(image source unshplash.com)
(4 / 7)
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం… జూన్ 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 31 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉంటుంది.
(5 / 7)
మార్కెట్ ధరల పెంపుపై మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన చేస్తాయి. మార్కెట్ వాల్యుతో పాటు విక్రయిస్తున్న ధరలను బేరీజు వేయటంతో పాటు పలు అంశాలను పరిశీలిస్తారు. సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి నుంచి కూడా అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్ారు. ఇందుకోసం 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అధికారంగా కొత్త విలువలను నమోదు చేస్తారు.
(6 / 7)
గ్రామీణ ప్రాంతాల్లో సవరణ ప్రక్రియతో పాటు పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ వాల్యూ సవరణ ప్రక్రియకు వేర్వురు మార్గదర్శకాలను విడుదల చేశారు. స్థానికంగా ఉన్న బహిరంగ మార్కెట్ విలువలను సేకరించే విషయంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా వివరాలను నమోదు చేయాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
(7 / 7)
ధరల పెంపు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. జూన్ 18 నుంచి మార్కెట్ విలువ పెంపుపై ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లతో మీటింగ్ ఉంటుంది. జూన్ 23 నాటికి మార్కెట్ వాల్యూ పూర్తి చేయాలని నిర్దేశించింది. జూన్29 నాటికిమార్కెట్ వాల్యూ ను రివిజన్ చేసే కమిటీల అప్రూవల్ తీసుకోనున్నారు. జులై 1 నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకుంటారు. ఇందుకు జూలై 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జులై 24వ తేదీన వాల్యూ ఫైనల్ అప్రూవల్ ప్రకటిస్తారు.జులై 31వ తేదీన డేటాను ఎంట్రీ చేస్తారు. ఆగస్టు 1 నుంచి–మార్కెట్ వాల్యూ పెంపు నిర్ణయం అమల్లోకి వస్తాయి. కొత్త ధరల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తుది నిర్ణయం అమలుకు ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు