TG Govt Mee Ticket App : 'మీ టికెట్' ఉంటే నో టెన్షన్...! ఈ కొత్త యాప్ గురించి తెలుసుకోండి-telangana govt unveils mee ticket app full details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Govt Mee Ticket App : 'మీ టికెట్' ఉంటే నో టెన్షన్...! ఈ కొత్త యాప్ గురించి తెలుసుకోండి

TG Govt Mee Ticket App : 'మీ టికెట్' ఉంటే నో టెన్షన్...! ఈ కొత్త యాప్ గురించి తెలుసుకోండి

Jan 22, 2025, 03:42 PM IST Maheshwaram Mahendra Chary
Jan 22, 2025, 03:42 PM , IST

  • Telangana Govt Mee Ticket App : తెలంగాణ ప్రభుత్వం 'మీ టికెట్‌' యాప్ ను తీసుకువచ్చింది. ఇందులో అన్ని రకాల టికెట్లు చాలా ఈజీగా పొందవచ్చు. ఆర్టీసీ,  మెట్రోతో పాటు ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి…..

తెలంగాణ ప్రభుత్వం 'మీ టికెట్‌' యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ తో ఎలాంటి టికెట్లు  అయినా… చాలా సులభంగా పొందవచ్చు. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం ఈ యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

(1 / 6)

తెలంగాణ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ సర్వీసెస్‌ డెలివరీ ఆధ్వర్యంలో ఈ యాప్ ను రూపొందించారు. ఇటీవలనే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ యాప్‌ను ప్రారంభించారు. టీజీఎస్ఆర్టీసీ, మెట్రో టికెట్లు సహా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లన్నీ ఈ యాప్ లో బుకింగ్ చేసుకునే సౌలభ్యాన్ని తీసుకువచ్చారు. 

(2 / 6)

'మీ టికెట్‌'లో యూపీఐ ద్వారా ఎలాంటి సర్వీస్‌ ఛార్జ్‌ లేకుండానే ఉచితంగానే టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. క్యూఆర్ బోర్డులను స్కాన్ చేసి కూడా పేమెంట్ చేసి బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది. 

(3 / 6)

 మీ టికెట్‌ యాప్‌లో బోటింగ్ , జూపార్క్, మ్యూజియాలాకు చెందిన టికెట్లు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 15కు పైగా ప్రముఖ దేవాలయాలతో పాటు వందకు పైగా పార్కింగ్ ప్రదేశాలకు సంబంధించి టికెట్ బుకింగ్ సేవలు ఈ యాప్ లో ఉంటాయి. 

(4 / 6)

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను కూడా మీ టికెట్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. లొకేషన్‌కు సమీపంలో చూడదగిన ప్రదేశాలుంటే ఆ సమాచారం సైతం యాప్‌లో చూడొచ్చు. 

(5 / 6)

స్మార్ట్‌ ఫోన్‌లో ప్లేస్టోర్‌ ద్వారా  'మీ టికెట్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా మెుబైల్ నంబర్ పాస్‌వర్డ్‌తో రిజిస్ట్రర్ కావాలి. లాగిన్ వివరాలతో యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అందుబాటులో ఉండే సేవలు కనిపిస్తాయి. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్ని సేవలు కూడా ఈ యాప్ లో ఉండే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు