TG New Ration Cards Updates : కొత్త రేషన్ కార్డులపై మరో అడుగు ముందుకు..! ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు-telangana govt latest orders on new ration cards issue process ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tg New Ration Cards Updates : కొత్త రేషన్ కార్డులపై మరో అడుగు ముందుకు..! ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు

TG New Ration Cards Updates : కొత్త రేషన్ కార్డులపై మరో అడుగు ముందుకు..! ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు

Aug 08, 2024, 09:22 PM IST Maheshwaram Mahendra Chary
Aug 08, 2024, 09:22 PM , IST

  • New Ration Cards in Telangana : త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఇటీవలే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి మరో ఉత్తర్వులను జారీ చేసింది.

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఆ దిశగా నిర్ణయం కూడా తీసుకుంది. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ కూడా జరిపింది. 

(1 / 6)

ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.

(2 / 6)

పలు రకాల సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

(3 / 6)

కేబినెెట్ భేటీలో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా… తాజాగా(ఆగస్టు 08) ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఛైర్మన్‌గా, ఉప కమిటీని ఏర్పాటు చేసింది. 

(4 / 6)

మంత్రివర్గ ఉప సంఘంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి.. ఆ తర్వాత విధి విధానాలను కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

(5 / 6)

రేషన్ కార్డుల ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే… ఈసారి మీసేవా పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది. కేవలం కొత్త రేషన్ కార్డులే కాకుండా… పాత కార్డుల్లో కూడా పేరు నమోదు కాని కుటుంబ సభ్యుల వివరాలను ఎంట్రీ చేసేందుకు వీలుగా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులపై కూడా ప్రకటన రావాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తుంటే… రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరితగతిన పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తోంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు