తెలుగు న్యూస్ / ఫోటో /
TG Cold Wave Alert : తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి తీవ్రత - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
- Telangana Cold Wave Alert :తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. వాతావరణపరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా…తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. జాగ్రత్తలను సూచించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. అయితే వాతావరణంలో మార్పుల దృష్ట్యా తెలంగాణ ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.
(2 / 7)
ప్రస్తుత సీజన్ లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తీవ్రమైన చలికి గురికావడం వల్ల హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
(3 / 7)
గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు.
(4 / 7)
చలి గాలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది,సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలని బులెటిన్ లో సూచించారు.
(5 / 7)
జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. విటమిన్ సీ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
(6 / 7)
చలి తీవ్రత దృష్ట్యా ఇంట్లో కర్రలు కాల్చడం వంటి పనులు చేయవద్దని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు