TG Property Tax : ఆస్తి పన్నుదారులకు శుభవార్త - బకాయిలపై భారీ డిస్కౌంట్...! ఈ ఛాన్స్ మిస్ కాకండి
- TG Govt Property Tax: రాష్ట్రంలోని పట్టణవాసులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. GHMC పరిధిలో ప్రకటించిన మాదిరిగానే అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులపై భారీ రాయితీని ప్రకటించింది. 90 శాతం వడ్డీ మాఫీతో ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే ఛాన్స్ ఇచ్చింది.
- TG Govt Property Tax: రాష్ట్రంలోని పట్టణవాసులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. GHMC పరిధిలో ప్రకటించిన మాదిరిగానే అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులపై భారీ రాయితీని ప్రకటించింది. 90 శాతం వడ్డీ మాఫీతో ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే ఛాన్స్ ఇచ్చింది.
(1 / 6)
తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలను క్లియర్ చేయడానికి వన్ టైమ్ స్కీమ్(OTS)ను ప్రకటించింది.
(istockphoto.com)(2 / 6)
2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తుండగా… ఇదే అవకాశాన్ని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
(istockphoto.com)(3 / 6)
జీహెచ్‌ఎంసీ తరహాలోనే అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరింది.
(istockphoto.com)(4 / 6)
వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద ఆస్తి పన్నుపై 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేస్తారు.
అయితే ఈ మార్చి 31 వరకు ఆస్తి పన్నుతో పాటు వడ్డీ కేవలం 10 శాతం చెల్లించే వారికి మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
(istockphoto.com)(5 / 6)
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో… 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పన్నుతో పాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఈ వన్ టైమ్ సెటిల్‌మెంట్ అవకాశాన్ని ఉపయోగించుకుని నగర, పట్టణ వాసులు సకాలంలో బకాయిలను క్లియర్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
(istockphoto.com)(6 / 6)
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటీఎస్ స్కీమ్ అమల్లో ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని పన్నులు చెల్లిస్తున్నారు. గతేడాది కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటీఎస్ ను తీసుకువచ్చారు. దీనివల్ల ఎంతో మంది ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అదే మాదిరిగా నగరవాసుల నుంచి స్పందన వస్తోందని చెబుతున్నారు.
(istockphoto.com)ఇతర గ్యాలరీలు