TG ePASS Scholarship Updates : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే...
- TS ePASS Scholarship Updates : తెలంగాణలో ఉపకార వేతనాలు, బోధన రుసుములపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును పెంచింది. అర్హులైన విద్యార్థులు మార్చి 31, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ గడువు డిసెంబర్ 31,2024తో పూర్తైన సంగతి తెలిసిందే.
- TS ePASS Scholarship Updates : తెలంగాణలో ఉపకార వేతనాలు, బోధన రుసుములపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును పెంచింది. అర్హులైన విద్యార్థులు మార్చి 31, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ గడువు డిసెంబర్ 31,2024తో పూర్తైన సంగతి తెలిసిందే.
(1 / 8)
ఉపకార వేతనాలు, బోధన రుసుములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ స్కాలర్ షిప్స్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ తేదీల గడువును పొడిగించింది.
(2 / 8)
ప్రభుత్వ తాజా నిర్ణయంతో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీ, దివ్యాగ విద్యార్థులు మార్చి 31, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.నిజానికి ఈ గడువు గతేడాది డిసెంబర్ 31వ తేదీతోనే పూర్తి అయింది.
(3 / 8)
చాలా మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. కొన్ని కోర్సుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావటంతో… చాలా మంది విద్యార్థులు.. ఈపాస్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. వీరంతా కూడా గడువు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే… ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు గడువు పెంచింది.
(4 / 8)
2024- 2025 విద్యాసంవత్సరానికి కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 4,83,254 మంది ఉంటారని అంచనా వేయగా.. కేవలం 1,39,044 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. దీంతో చాలా మంది విద్యార్థులు… అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే…. ప్రభుత్వం దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించింది.
(5 / 8)
అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/. వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఈ గడువులోపు చేసుకునే అవకాశం ఉంది.
(6 / 8)
కొత్త విద్యార్థులు అయితే.. 'Fresh Registration' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "Submit" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని.. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
(7 / 8)
https://telanganaepass.cgg.gov.in/applicationStatus.do లింక్ తో స్కాలర్ షిప్స్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక రెన్యూవల్ విద్యార్థులు కూడా ఇదే మాదిరిగా ప్రాసెస్ చేసుకోవాలి. అయితే వారు Renewal Registration అనే ఆప్షన్‌పై నొక్కి….రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇతర గ్యాలరీలు