Gandhi Govt Hospital : సంతానం లేని దంపతులకు గుడ్ న్యూస్.. ఇక గాంధీ ఆస్పత్రిలో 'IVF' సేవలు
- Fertility Centre In Gandhi Hospital: సంతానం లేని దంపతులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ సెంటర్ ను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు.

(1 / 4)
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని తల్లీపిల్లల విభాగంలోని 5వ అంతస్తులో తొలిసారిగా ఈ ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ మొదలుకానుంది. ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు.
(Twitter)(2 / 4)
రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గాంధీ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్ లో సంతానం పొందే అవకాశముంది.
(Twitter)(3 / 4)
మరోవైపు 2018లో గాంధీ ఆస్పత్రి సంతాన సాఫల్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం టెస్టులు, కౌన్సెలింగ్‌తోపాటు ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) పద్ధతిలో సంతానం పొందేలా ప్రయత్నం చేసేవారు. ఈ విధానంలో ఇప్పటికే కొందరికి సంతాన భాగ్యం దక్కింది. తాజాగా అత్యాధునిక ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.
(Twitter)ఇతర గ్యాలరీలు