TG Indiramma Housing Scheme Updates : పకడ్బందీగా 'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' అమలు - తెరపైకి ప్రత్యేక యంత్రాంగం..!
- Telangana Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యాప్ సర్వే పూర్తి కావొచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో ఈ స్కీమ్ అమలు కోసం మరికొంత అధికార యంత్రాగాన్ని కూడా రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. తాజా అప్డేట్స్ చూడండి..
- Telangana Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యాప్ సర్వే పూర్తి కావొచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో ఈ స్కీమ్ అమలు కోసం మరికొంత అధికార యంత్రాగాన్ని కూడా రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. తాజా అప్డేట్స్ చూడండి..
(1 / 7)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యాప్ సర్వే పూర్తి కావొచ్చింది. త్వరలోనే అర్హుల జాబితాలను సిద్ధం చేయనుంది.
(2 / 7)
జనవరి 26వ తేదీ నాటికి అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా… ఈలోపే గ్రామసభల ద్వారా అర్హుల జాబితాను ఫైనల్ చేయనుంది. అంతేకాకుండా… వీటికి జిల్లా ఇంఛార్జ్ మంత్రులతో పాటు కలెెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది.
(3 / 7)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఎలాంటి అవకతవలకు తావు ఇవ్వకుండా అమలు చేయాలని భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పై వరకు ఈ స్కీమ్ అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విషయంపై దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న చాలా మంది అధికారులు, సిబ్బందిని సొంత శాఖకు రప్పించింది.
(4 / 7)
అర్హలను ఖరారు చేసిన తర్వాత… ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయం కల్లా భారీ ఎత్తున అధికారుల సేవలు గృహ నిర్మాణశాఖకు అవసరపడనున్నాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం…. ప్రత్యేక అధికారుల యంత్రాంగాలను బరిలోకి దించాలని యోచిస్తోంది.
(5 / 7)
ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రభుత్వం ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించింది. వీటితో పాటు రెండు నియోజకవర్గాలకు కలిపి డీఈ, ఒక్కో నియోజకవర్గానికి ఏఈని నియమించింది. వీరే స్కీమ్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు.
(6 / 7)
ప్రస్తుతం ఉన్న అధికార యంత్రాంగం సరిపోకపోతే… ఇతర శాఖల నుంచి అధికారులను తీసుకునే అవకాశం ఉంది. ఈ దిశగా ఇప్పట్నుంచే సర్కార్ కసరత్తు చేస్తోంది. సరిపడిన స్థాయిలో అధికారులను సర్దుబాటు చేసి.. స్కీమ్ అమలులో ఎలాంటి అడ్డంకులు రావొద్దని భావిస్తోంది. ప్రతి దశలోనూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవటంతో పాటు తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో కూడా వేగంగా ముందుకెళ్లేలాని యోచిస్తోంది.
(7 / 7)
ఇప్పటికే యాప్ సర్వే పూర్తి కావొచ్చింది. గ్రామ సభల్లో అర్హుల జాబితాలను ప్రకటించనున్నారు. వీటిని జిల్లా ఇంఛార్జ్ మంత్రికి పంపుతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత.. జిల్లా కలెక్టర్ తుది జాబితాను ప్రకటిస్తారు. అర్హులకు ప్రోసిడింగ్స్ కాపీని అందజేస్తారు. అయితే మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేయనుంది. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది.
ఇతర గ్యాలరీలు