(1 / 6)
మహిళా సంఘాలకు అండగా నిలిచేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్ఠిక సాయం అందజేయాలని నిర్ణయించింది.
(2 / 6)
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచే నేరుగా రూ.10 లక్షల పరిహారం అందజేయాలని సర్కార్ తాజాగా నిర్ణయించింది. బీమా పాలసీ లేకున్నా డబ్బులను అందజేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.
(3 / 6)
గత ఏడాది 385 మంది మృతులైన వారికి రూ. 38.5 కోట్ల పరిహారం చెల్లింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే వీరికి డబ్బులను అందజేయనుంది.
(4 / 6)
గతంలో ఈ మొత్తం బీమా కంపెనీల ద్వారా చెల్లించేవారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు నేరుగా నిధులు అందుతాయి. ఈ నిర్ణయంతో బాధిత కుటుంబాలకు బాసట దొరకనుంది.
(5 / 6)
మరోవైపు మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించే దిశగా అడుగులు వేయనుంది.
(6 / 6)
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగానూ పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాలని భావిస్తోంది.
ఇతర గ్యాలరీలు