(1 / 6)
తెలంగాణలోని మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించాలని సంకల్పించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
(2 / 6)
మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమలులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని చెప్పారు.
(3 / 6)
శనివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి “రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలి. వారిని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు వెళుతున్నారు. గడిచిన ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించింది" అని చెప్పారు.
(4 / 6)
మహిళా స్వయం సంఘాల సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కార్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. తద్వార మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్ చేయించడం, హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయించడం, ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సహాయం అందించడం కాదు. వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా సహాయం అందించవచ్చని అభిప్రాయపడ్డారు.
(5 / 6)
పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కన్నారు. ఆడబిడ్డలు వ్యాపారాల్లో నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా నిలబడుతాయన్నారు. మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుందని వ్యాఖ్యానించారు.
(6 / 6)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో త్వరలోనే మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్డులు ఇచ్చే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారు.
ఇతర గ్యాలరీలు