తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ కు అప్లయ్ చేశారా..? మరికొన్ని గంటలే గడువు-telangana epass scholarship registrations will be closed on 30 june for 2024 2025 academic year ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ కు అప్లయ్ చేశారా..? మరికొన్ని గంటలే గడువు

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ కు అప్లయ్ చేశారా..? మరికొన్ని గంటలే గడువు

Published Jun 29, 2025 01:10 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 29, 2025 01:10 PM IST

తెలంగాణలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ గడువు జూన్ 30వ తేదీతో పూర్తి కానుంది. అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు.

(1 / 6)

గత విద్యా సంవత్సరానికి సంబంధించి 12 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలకు అర్హులు కాగా ఇప్పటివరకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా కొంత మంది విద్యార్థులు మిగిలిపోవటంతో అధికారులు జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

(2 / 6)

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం ఈ గడువును పొడిగించారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావటంతో.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో… అధికారులు జూన్ 30 వరకు అవకాశం కల్పించారు. అయితే ఇందుకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో… మిగిలిపోయిన విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ లేదా రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

(3 / 6)

నిజానికి ఉపకారవేతనాల గడువు గతేడాది డిసెంబర్ లో పూర్తయింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు…పలుమార్లు పొడిగించారు. ఈ క్రమంలోనే… అన్ని కోర్సుల విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దని…మే 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో జూన్ 30 వరకు అవకాశం కల్పించారు.

(4 / 6)

అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.

(5 / 6)

కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

(6 / 6)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు