TG ECET Schedule 2025 : టీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల - మార్చి 3 నుంచి అప్లికేషన్లు, ముఖ్య వివరాలివే
- Telangana ECET Notification 2025 : తెలంగాణలో ఈసెట్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది . ఫిబ్రవరి 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. మే 12వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూడండి….
- Telangana ECET Notification 2025 : తెలంగాణలో ఈసెట్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది . ఫిబ్రవరి 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. మే 12వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూడండి….
(1 / 6)
తెలంగాణలో ప్రవేశాల ప్రక్రియ వేగంగా నడుస్తోంది. కొద్ది నెలల కిందటే కన్వీనర్లను నియమించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి… తాజాగా ఒక్కో పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటిస్తోంది.
(image source istock.com)(2 / 6)
తాజాగా తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా డిప్లొమా హోల్డర్లు…. బీఎస్సీ (గణితం), బీటెక్, బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలను కల్పిస్తారు.
(image source istock.com)(3 / 6)
ఈ ఏడాది కూడా ఈసెట్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 25వ తేదీన ప్రకటిస్తారు.
(4 / 6)
ఈసెట్ పరీక్ష కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 19వ తేదీతో ముగుస్తుంది.
(image source istock.com)(5 / 6)
మే12వ తేదీన టీజీ ఈసెట్ పరీక్ష ఉంటుందని కన్వీనర్ ఆచార్య పి.చంద్రశేఖర్ వివరించారు. నోటిఫికేషన్ లో పరీక్షా విధానం, ఫీజు చెల్లింపు ప్రక్రియ, హాల్ టికెెట్లు డౌన్లోడ్, ఫలితాలను ప్రకటనతో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తారు.
(image source istock.com)(6 / 6)
అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.
ఇతర గ్యాలరీలు